దిల్ రాజ్ సోదరుడి కొడుకు ఆశిష్ గత సంవత్సరం ‘రౌడీ బాయ్స్’ మూవీతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. యూత్ ఫుల్ మూవీగా తీసినటువంటి ఈ సినిమాకు హర్ష అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యావరేజ్ గా హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీనితో ఆశిష్ నుండి చాల సినిమాలు వస్తాయని చాలమంది ఆశించినట్లు తెలుస్తోంది.అయితే అతడి నుండి మరొక సినిమా ఇప్పటివరకు రాలేదు. కొన్ని నెలల క్రితం  ‘సెల్ఫీష్’ అన్న సినిమాను మొదలుపెట్టారు. గతంలో ‘హుషారు’ అన్న టైటిల్ తో సినిమాను తీసిన హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో విడుదలై ఘన విజయం సాధించి తెలుగులో కూడ డబ్ అయిన ‘లవ్ టుడే’ మూవీ హీరోయిన్ ఇవనా ఆశిష్ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వచ్చాయి.ఈసినిమా మొదలై చాలకాలం అయినప్పటికీ ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్స్ బయటకు రాకపోవడంతో ఈ మూవీ ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నాయి. అయితే జరిగింది వేరు అని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న హర్ష సినిమాను తీయడంలో తడబాటుకు గురి కావడంతో దిల్ రాజ్ ఈ మూవీని ఆపేసినట్లు మాటలు వినిపించాయి.అయితే హర్ష దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడంతో ఈసినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాల శ్రద్ద పడుతున్నట్లు సమాచారం. ఈసినిమా కథలో అదేవిధంగా స్క్రీన్ ప్లే లో అనేక మార్పులు చేర్పులు సుకుమార్ సూచనతో జరగడంతో ఈ మూవీని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అని అంటున్నారు. గతంలో సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ మూవీ కథ విషయంలో కూడ అనేక మార్పులు చేర్పులు చేశాడు. ఇప్పుడు సుకుమార్ తన మరో శిష్యుడు కోసం రంగంలోకి దిగడంతో దిల్ రాజ్ వారసుడు ఆశిష్ కు దశ తిరిగినట్లే అంటూ కొందరి కామెంట్స్..  మరింత సమాచారం తెలుసుకోండి: