
ఇక అటు అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఎవరైన తనరపై విమర్శలు చేస్తే.. తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది ఈ భామ. బుల్లితెరకు దూరమై సినిమాల్లో బిజీ అయిన అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తన వ్యక్తి గత విషయాలతో పాటు.. రోజుకో ఫోటో షూట్ చేస్తూ వదులుతోంది.ఇక తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి అనసూయ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'నవంబర్ 29, 2023 సరిహద్దులు దాటి ముందుకు వెళ్లిన రోజుగా గుర్తుండిపోతుంది అనే క్యాప్షన్ ఇచ్చి ఈ పోస్టును అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫోటోల్లో తాడుకి వేలాడుతూ తలకిందులుగా అనసూయ ఓ బోల్డ్ ఫీట్ చేసింది. ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అనసూయ అందం కోసం పడుతున్న పాట్లు చూసి.. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొంత నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అందంత కోసం ఇంత పాట్లు అవసరమా అంటున్నారు కొంత మంది. ఇక అనసూయ ఏరియల్ యోగ చేస్తారని చెప్పుకువచ్చింది. దాంతో పాటు లేత కొబ్బరికాయ తింటారని ఓ ఫోటో పెట్టింది. ప్రస్తుతం అనసూయ పోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ పోస్టుకి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. ఇప్పటికే మైఖేల్, రంగ మార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇక పుష్ప 2 లో నటిస్తుంది. దానితో పాటు.. ప్రభుదేవ వుల్ఫ్ కాకుండా మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.