నాన్న కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పిచ్చి ప్రేమ కథే ఈ 'యానిమల్‌'. ఇక ఇదొక రివేంజ్‌ డ్రామా. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ కథను చాలా బోల్డ్‌గా, వయోలెంట్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్‌ ఇవన్నీ ఉంటాయి. అయితే ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా కథనం సాగుతుంది. ఇంకా అలాగే కామెడీ కూడా బోల్డ్‌గానే ఉంటుంది.సినిమా మొత్తం కూడా సందీప్‌రెడ్డి వంగా స్టై‍ల్లోనే సాగుతుంది. నాన్న పాటతో చాలా ఎమోషనల్‌గా ఈ కథ ప్రారంభం అవుతుంది. ఇక ఆ తర్వాత హీరో పాత్ర అగ్రెసివ్‌గా ఉంటుందని ఒకటి, రెండు సన్నివేశాలతో డైరెక్టర్ తెలియజేశాడు. హీరోయిన్‌ ఎంట్రీ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎంగేజ్‌మెంట్‌ అయిన హీరోయిన్‌ని..తన మాటలతో హీరో ప్రేమలో పడేసే సీన్‌ అయితే చాలా కొత్తగా,థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ బాగా బోల్డ్‌గా ఉంటాయి. ఇంకా అలాగే వయోలెన్స్‌ కూడా ఎక్కువే. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ అయితే అదిరిపోతుంది. తనదైన స్క్రీన్‌ప్లేతో ఫస్టాఫ్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిపించాడు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి.ఇక సెకండాఫ్‌లో చాలా సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. హీరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వచ్చిన తర్వాత ఇంట్లో డాక్టర్లతో మాట్లాడే మాటలు అయితే చాలా బోల్డ్‌గా ఉంటాయి. హీరో నగ్నంగా ఆరు బయటకు రావడానికి గల కారణం కూడా కన్విన్సింగ్‌గానే ఉంటుంది.


ఈ సీన్‌ కంటే ముందు వచ్చే సీన్లలో రణ్‌బీర్‌ ఫెర్ఫార్మెన్స్‌ అదిరిపోయేలా ఉంటుంది. ఈ సినిమాలో విజయ్‌ ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ.. గీతాంజలి ఎందుకు భరిస్తుందో తెలియజేసే సీన్‌..భార్య భర్తల మధ్య ఉన్న బాడింగ్‌ని తెలియజేస్తుంది.ఇక జోయాతో రొమాన్స్‌ తర్వాత..గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు అయితే చాలా మెచ్యుర్డ్‌గా ఉంటాయి. బాబీ డియోల్‌ పాత్ర ఎంట్రీ సీన్‌ అయితే అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో బాబీ, రణ్‌బీర్‌కి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకు పెద్ద హైలెట్‌.ఎందుకంటే యాక్షన్‌, ఫ్యాక్షన్‌ కలబోసిన ఓ ఎమోషననల్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే మితిమీరిన హింస, శృంగార సీన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు కాస్త ఇబ్బంది అనిపించొచ్చు కానీ, మిగతావారికి మాత్రం ఓ డిఫరెంట్‌ సినిమా చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది.ఇక హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటన గురించి అందరికి తెలిసిందే. ఎందుకంటే అతను ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. రణ్‌ బీర్ విజయ్‌ సింగ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. టీనేజ్‌.. యంగ్‌ ఏజ్‌, ఓల్డ్‌ ఏజ్‌ ఇలా మూడు దశల పాత్రల్లో కూడా తనదైన నటనతో అదరగొట్టేశాడు. ఈ క్యారెక్టర్‌లో రణ్‌బీర్‌ కపూర్ ని తప్ప మరొకరు నటించలేరు అనేంతలా అతని యాక్టింగ్‌ ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: