తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ సంస్థ ఒకటి. వీరు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీ మంతుడు మూవీ తో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈ సంస్థ నుండి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీ లు వచ్చాయి.

ఈ రెండు మూవీ లు కూడా భారీ విజాయలను సాధించడంతో ఈ నిర్మాణ సంస్థ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం వీరు అనేక క్రేజీ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వీరు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ మూవీ ని నిర్మించబోతున్నారు అని ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గోపీచంద్ మలినేని అజిత్ తో మూవీ చేయబోతున్నాడు అనే వార్తలు అన్ని అవాస్తవం అని తెలిసింది.

ఇకపోతే మైత్రి సంస్థ వారు మాత్రం అజిత్ తో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా మార్క్ ఆంటోనీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఓ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ మొత్తం సెట్ అయినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: