బాలీవుడ్ యువ నటుడు రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ లాంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ తాజాగా డిసెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పరవాలేదు అనే టాక్ ను తెచ్చుకుంది.

ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడం ... అలాగే ఈ మూవీ కి కూడా పర్వాలేదు అనే టాక్ రావడంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మవేసినట్లు అందులో భాగంగా ఈ మూవీ బృందం ఈ సంస్థతో ఈ మూవీ ని జనవరి 26 వ తేదీ నుండి "ఓ టి టి" లో స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ మూవీ ని జనవరి 26 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: