నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఇప్పటి వరకు చాలా బ్లాక్ బస్టర్ సినిమా లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో అఖండ మూవీ ఒకటి. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని మిర్యల రవీందర్ రెడ్డి నిర్మించాడు. 

మూవీ లో శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ లో బాలకృష్ణ ... రైతుగా ,  అఘోర గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ఈ రెండు పాత్రల్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2021 వ సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా నేటితో రెండేళ్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో తమన్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ముఖ్యంగా ఈ మూవీ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కి గాను ఈయనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: