టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటించగా ... రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ కు 24 గంటల్లో ఏ రేంజ్ వ్యూస్ ... లైక్స్ లభించాయి అనే వివరాలను తెలుసుకుందాం.

 సలార్ మూవీ యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ కి 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ ... 1.238 మిలియన్ లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ.పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ కూడా సూపర్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: