టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకోవడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్ లు వచ్చాయి. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

యానిమల్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.25 కోట్ల షేర్ ... 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరీ లోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 6.75 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: