నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన పెద్దగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఇక ప్రస్తుతం నాని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఈయన శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నాని నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు కూడా ఈ సినిమాలోని నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే దసరా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటించాడు. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా వషిం అబ్దుల్ వాహేబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది.

 ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా నాని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాని మాట్లాడుతూ ... నేను వరసగా సినిమాలు చేస్తూనే ఉంటాను. ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని అనుకుంటే కొంత కాలం వారి కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఏ దర్శకుడితో సినిమా చేయాలి అని అనుకోను. ఎవరైనా నాకు వచ్చి కథ చెబితే ఆ కథ నచ్చితే ఆ దర్శకుడితో సినిమా చేస్తుంటాను. అలాగే ఓ దర్శకుడి కోసం వెయిట్ చేస్తూ ఉండడం నాకు నచ్చదు అని నాని తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: