
'కొందరికి ఎక్కువ అనుభవం ఉంది, మరికొందరు ఎక్కువ అభివృద్ధి చెందారు. కానీ మనం ఏ స్థాయిలోనూ సమానం కాదు అని అంది. అలాగే ఆడవాళ్లకు మగవాళ్ళు కావాలా.? ఖచ్చితంగా.. మహిళలకు పురుషులు ఎంత అవసరమో.., పురుషులకు కూడా మహిళలు అవసరం. మా అమ్మ తన జీవితాన్ని ఒంటరిగా గడపవలసి వస్తే, ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉండేవి..' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.దీని పై కంగనా స్పందిస్తూ.. 'మా అమ్మ లేకుండా నాన్న కూడా ఉండలేరు. ఇందులో అవమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు. పురుషులకు నెలలో ఏడు రోజులు రక్తస్రావం జరగదు.. వారికి దైవిక శక్తి లేదు.. ఈరోజు స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు. ముఖ్యంగా యువతులకు ఇది అంత ఈజీ కాదు..' అని కంగనా రనౌత్ కూడా చెప్పింది. ప్రస్తుతం కంగనా రనౌత్ పోస్ట్ మాత్రమే సర్వత్రా చర్చనీయాంశమైంది.