మరికొన్ని గంట ల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.ఈ పార్టీనే అధికారం లోకి వస్తుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే సీఎం ఎవరు అవుతారనే చర్చ కూడా జరుగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీషకు 15000 ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.అయితే బర్రెలక్క శిరీష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని శిరీష చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నా బావ అని అని నా లవర్ కూడా ఆయనేనని శిరీష వెల్లడించారు. నా క్రష్ కూడా అతనేనని శిరీష అన్నారు. పోలీస్ డ్రెస్ లో మహేశ్ బాబు అంటే చాలా ఇష్టమని శిరీష పేర్కొన్నారు. మహేష్ బాబు వల్ల నాకు పోలీస్ అవ్వాలనే ఆలోచన వచ్చిందని శిరీష పేర్కొన్నారు. మహేష్ బాబు నటించిన అన్ని సినిమాలు చూశానని శిరీష పేర్కొన్నారు. సాయి కుమార్ డైలాగ్ డెలివరీ చాలా ఇష్టమని సాయి కుమార్ సినిమాలను సైతం ఇష్టపడతానని శిరీష అన్నారు. కుటుంబ సమస్యల వల్ల నేను ప్రేమ జోలి కి వెళ్లలేదని శిరీష తెలిపారు. శిరీష చెప్పిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శిరీషకు అనుకూల ఫలితాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. శిరీషను అభిమానించే వాళ్ల సంఖ్య అంత కంతకూ పెరుగుతోంది. భవిష్యత్తు లో అయినా శిరీషకు అనుకూల ఫలితాలు వస్తాయని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైతే శిరీష ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. శిరీష రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. శిరీషకు భవిష్యత్తు లో ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: