తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మూవీ లోని మొదటి పాట అయినటువంటి "ఆడు మచ్చ" అంటూ సాగే సాంగ్ ను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీ తో ప్రేక్షకులను పలకరించి యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు. మరి ఈగల్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: