మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందింది. దానితో ఈ సినిమా పై రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ ను తెచ్చుకొని యావరేజ్ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ మూవీ లో రవితేజ నటనకు గాను ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. 

ఇకపోతే ప్రస్తుతం ఈయన ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ మూవీ లోని మొదటి పాటను కూడా రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేయబోతుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను "ఐకాన్" మ్యూజిక్ సంస్థ దక్కించుకున్నట్లు తాజాగా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: