అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన టాప్ 10 టాలీవుడ్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన కేవలం 3 నిమిషాలలోనే 100 కే లైక్స్ ను సాధించింది. పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ విడుదల అయిన నాలుగు నిమిషాల్లో 100 కే లైక్స్ సాధించింది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించింది. రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ట్రైలర్ విడుదల ఎనిమిది నిమిషాల సమయంలో 100 కే లైక్స్ ను సాధించింది.


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ విడుదల అయిన తొమ్మిది నిమిషాల్లో 100 కే లైక్స్ ను సాధించింది. ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 9 నిమిషాల సమయంలో 100 కే లైక్స్ ను సాధించింది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప మూవీ ట్రైలర్ విడుదల అయిన 19 నిమిషాల సమయంలోనే 100 కే లైక్స్ ను సాధించింది. పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన బ్రో సినిమా ట్రైలర్ 21 నిమిషాల్లో 100 కే లైక్స్ ను సాధించింది. ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ ట్రైలర్ 27 నిమిషాల్లో 100 కే లైక్స్ ను సాధించింది. ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ 27 నిమిషాల్లో 100 కే లుక్స్ ను సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: