రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఇండియాలోనే అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయింది. ఇకపోతే తాజాగా ప్రభాస్ "సలార్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా అందులో మొదటి భాగం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా .... రవి బూస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ ఇండియా వైడ్ గా లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ప్రభాస్ చిన్నప్ప పాత్ర కనిపిస్తోంది అని ప్రభాస్ పెద్దయిన తర్వాత పాత్ర కనిపించడానికి చాలా సమయం పట్టనున్నట్లు దాదాపు ఇంటర్వెల్ ముందు ప్రభాస్ ఎంట్రీ ఉండనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: