నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకు పోతున్నాడు అనే విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లు సాధిస్తున్నాడు. దసరా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నాని ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ డ్రామా సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. డిసెంబర్ 7వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 కాగా ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు నాచురల్ స్టార్ నాని. కాగా ఈ మూవీ లో నాని సరసన మృణాల ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల లో పాల్గొంటున్న నాని తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ను కూడా తనతో సినిమా చేయమని అడగలేదు అంటూ నాని చెప్పుకొచ్చాడు.


 ఎప్పటికీ అలా అడగను కూడా. ఎందుకంటే పలానా డైరెక్టర్ తో సినిమా చేయాలని కూర్చుంటే కొంతకాలం వేచి చూడాలి. అది నాకు అస్సలు నచ్చదు అంటూ నానీ చెప్పుకొచ్చాడు. అందుకే నాతో సినిమా చేయాలని ఇప్పుడు వరకు ఎవరిని నేను స్వయంగా అడగలేదు. ఇకపై అడగను కూడా. నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం కూడా అలా అడగను. ఫలానా దర్శకుడుతోనే చిత్రం చేయాలని అనుకోవడం నాకు నచ్చదు నేను వరుసగా మూవీస్ చేస్తూనే ఉంటా. అదే నా పని అంటూ నాని చెప్పుకొచ్చాడు. కాగా హాయ్ నాన్న మూవీ కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: