త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న రాంచరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గేమ్ చేంజ్ ఆ తర్వాత మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను కూడా ఇప్పటికే లైన్లో పెట్టేశాడు చరణ్. ఈ క్రమంలోనే ఈ మూవీ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సనాతొ ఒక భారీ సినిమా చేయబోతున్నాడు అని చెప్పాలి.


 ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా బుచ్చిబాబు చరణ్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్గా పరిచయం కాబోతున్న జాన్వి కపూర్ ని ఈ మూవీలో తీసుకోబోతున్నారని సమాచారం. జాన్వి పాత్ర సినిమా కథలో ఎంతో కీలకంగా ఉండబోతుందట. అతిథి పాత్ర కోసం మరో హీరోయిన్ అనుకుంటున్నారట.


 అయితే ఈ మూవీలో రామ్ చరణ్ ఢీకొట్టే విలన్ పాత్రలో క్రేజీ హీరో విజయ్ సేతుపతిని అనుకుంటున్నారట. అయితే గతంలోనే బుచ్చిబాబు ఉప్పెన సినిమాలో సేతుపతి విలన్ పాత్రలో నటించాడు.  అతను ఒప్పుకుంటే ఇక అతనే విలన్ అవుతాడని.. లేదంటే మరొకరి ఎంపిక చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మూవీని నిర్మిస్తుంది అన్నది తెలుస్తుంది. అయితే ఏ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కక పోతుంది అనే విషయంపై మాత్రం ఎన్నో ఊహాగానాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే అప్పట్లో చరణ్ తండ్రి చిరంజీవి జాన్వి తల్లి శ్రీదేవి ప్రేక్షకుల ఫేవరెట్ జోడిగా ఉంది. మరి ఇప్పుడు చరణ్ -  జాన్వి జోడి ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: