తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఏ భాషలో అయినా సరే అటు ఒక హీరో చేసే కమర్షియల్ సినిమా కంటే ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే మల్టీస్టారర్ సినిమాలకే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే ఎంతోమంది హీరోల అభిమానులు ఇక తమ అభిమాన హీరో మరో హీరోతో కలిసి నటిస్తే చూడాలని ఆశ పడుతూ ఉంటారు. ఇక అలాంటి మల్టీ స్టార్లర్ రిపీట్ అయిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. అంతే కాదు ఆ మల్టీ స్టారర్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి.


 ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలు అందరూ కూడా ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ తో మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏ క్రమంలోనే మల్టీస్టారర్ చేస్తే ఇద్దరు హీరోల అభిమానులు కూడా సినిమా చూసి సూపర్ హిట్ అవడం ఖాయమని దర్శక నిర్మాతలు ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటివరకు త్రిబుల్ ఆర్ లాంటి ఎన్నో క్రేజీ మల్టీస్టారర్ లు కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్లు కొట్టాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోల కాంబో మల్టీస్టారర్ కు సంబంధించిన మూవీ గురించి ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.


 ఇటీవల కాలంలో నాచురల్ స్టార్ నాని మల్టీ స్టారర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. తాను మహేష్ బాబుతో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దీనిని దర్శకుడు త్రివిక్రమ్ తో మాత్రమే చేస్తాను అన్నట్లుగా నాచురల్ స్టార్ నాని హింట్ ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అయితే గతంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నాని ముఖ్యపాత్రలో కనిపిస్తాడని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక ఈ కాంబో రిపీట్ అయితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం నాని హాయ్ నాన్న సినిమాతో డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: