టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మనుషి చిల్లర్ ... వరుణ్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... యాడ్ ఫిల్మ్‌ మేకర్‌ ... సినిమాటో గ్రాఫర్‌ ... వీ ఎఫ్‌ ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ ఈ మూవీ ని డైరెక్ట్‌ చేస్తున్నాడు . ఈ మూవీ లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌ గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది . 

యదార్థ సంఘటనల స్పూర్తి తో తెలుగు , హిందీ లలో బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌ గా ఈ మూవీ ని రూపొందిస్తున్నారు . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది . ఇక పోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడినా కూడా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల గురించి ఇన్ని రోజుల పాటు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ... వరుణ్ తేజ్ హీరోగా మనుషి చిల్లర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ని కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు చెప్పిన తేదీ కి విడుదల చేయలేకపోతున్నాము. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం అని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: