తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్న సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి  సినిమా మొదటి స్థానంలో ఉంటుంది.ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా లో సుకుమార్ తనదైన మేకింగ్ స్టైల్ తో సినిమా స్టాండర్డ్ మార్చేసినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సుకుమార్ ఎన్టీఆర్ ఇద్దరికి వెళ్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. ఇక తండ్రి సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒక మంచి సినిమా గా నిలిచింది...ఇక ప్రస్తుతం రీసెంట్ గా రన్బీర్ కపూర్ హీరో గా వచ్చిన అనిమల్ సినిమా కూడా తనదైన రీతిలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుంది.ఇక నాన్న సెంటిమెంట్ తో వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతుంది.   ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ కలక్షన్స్ ని రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచింది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టే అవకాశం కూడా ఉంది.ఇక ఇపుడు ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా వస్తె అది పక్క హిట్ అనే దిశ గా ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది.ఇక దానికి తగ్గట్టు గానే మరికొన్ని సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి...ఇవి కూడా హిట్ అయితే ఇక ముందు ముందు చాలా సినిమాలు నాన్న సెంటిమెంట్ తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: