చెన్నైలో మిగ్ జామ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ తుఫాన్ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర పనుల మీద బయటకు రాలేని పరిస్థితుల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు చెన్నైలో ఉన్న సినీ సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నే కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరింది.

 ఇదే విషయాన్ని అతను తన  ఫోటోలతో సహా పంచుకున్నారు. ఈ మేరకు విష్ణు విశాల్ పోస్ట్ చేస్తూ.." నా ఇంట్లోకి వరద నీరు చేరుతుంది. కరపాక్కంలో నీటిమట్టం దారుణంగా పెరుగుతోంది. నేను సహాయం కోసం పిలిచాను. కరెంటు లేదు, వైఫై లేదు, ఫోన్ సిగ్నల్ ఏమీ లేదు. మా ఇంటి పై ఉన్న టెర్రస్ మీద మాత్రమే నాకు కొంత సిగ్నల్ వస్తుంది. నాతో పాటు ఇక్కడున్న చాలా మందికి సహాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై అంతటా ఉన్న ప్రజలందరూ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నాకు తెలుస్తోంది" అంటూ రాస్కొచ్చాడు. అంతేకాకుండా తన ఇంట్లో వరద నీరు చేరిన ఫోటోలను షేర్ చేశాడు. 

దీంతో విష్ణు విశాల్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కాగా తమిళంలో ముండసుపట్టి’, ‘రాత్ససన్‌’ ఎఫ్‌ఐఆర్, మట్టికుస్తీ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. రీసెంట్ గా వచ్చిన 'మట్టి కుస్తీ' మూవీతో తెలుగు ఆడియన్స్ కి సైతం దగ్గరయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్నాడు. హీరో గానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న లాల్ సలాం మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ హీరో.. ధనుష్ హీరోగా తెరకెక్కనున్న 50వ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: