నాచురల్ స్టార్ నాని నటించిన  లేటెస్ట్ సినిమా ఆయన హాయ్ నాన్న.  నాని అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఏ చిన్న మూమెంట్ ని వదలకుండా తన సినిమా ప్రమోషన్ కి వాడుకుంటున్నాడు. ఇప్పటికే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులతో చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తూ సందడి చేసిన నాని అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చాడు. అందులో ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ పై నాని రియాక్షన్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. హాయ్ నాన్న టీజర్ రిలీజ్ సమయంలో లిప్ లాక్ పై నానికి ఒక ప్రశ్న ఎదురయ్యింది. 

'ఈమధ్య మీ ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేస్తున్నారుగా' అని అడిగితే ఇందుకు నాని బదులిస్తూ.." క‌థ డిమాండ్ చేసిన‌ప్పుడు ఎలాంటి సీన్స్ అయినా చేయాలి. ఇక్క‌డ‌ క‌థ‌కు అవ‌స‌రం కాబ‌ట్టే లిప్ లాక్ సీన్స్ చేశాం. ఇలాంటివి చేసిన‌ప్పుడు ఇంట్లో చాలా గొడ‌వ‌ల‌వుతుంటాయి, కానీ త‌ప్ప‌క చేస్తుంటామ‌ని" చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నపై నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'హాయ్ నాన్న మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.. అంటే ఇందులో లిప్ లాక్ సీన్స్ తీసేసారా? లేక ఉండి కూడా యూ సర్టిఫికెట్ వచ్చిందా? అని అడిగితే, లిప్ లాక్ లో తప్పేముంది. 

నా కొడుకు ముందే నా భార్యను కిస్ చేస్తాను అని అన్నాడు." నా ఏడేళ్ల కొడుకు ముందు నా భార్యను ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు. ఇది కూడా ప్రేమ అని వాళ్లకు ఈ ఏజ్ లోనే చెప్తున్నాం. అది తప్పు కాదు. బూతు కాదు అని. అది సినిమాలకు వచ్చేసరికి బూతు ఎందుకు అవుతుంది. పబ్ లోనో ఎక్కడో వ్యక్తి వేరే అమ్మాయికి ముద్దులు పెడుతూ చూపిస్తే అది ప్రాబ్లం ఏమో కాని వాడు లవ్ చేసిన అమ్మాయిని కిస్ చేయడంలో తప్పేముంది" అంటూ మరోసారి లిప్ లాక్ పై తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు నాని. దీంతో నాని కానీ చెప్పిన మాటలతో కొంతమంది నెటిజన్స్ సైతం ఏకీభవిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకోండి: