అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వి కపూర్. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత పలు సినిమాలు చేసి భారీ హిట్టును తన సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే హాట్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జాన్వి  కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి.

అయితే జాన్వికపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం జాన్వి కపూర్ కి వచ్చింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఇక బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తున్న జాన్వికాపూర్ కి పెద్దగా క్రేజ్ రావడం లేదు. కానీ దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అని తెలుగు ఆడియన్స్ కి తెలియడంతో ఈ ముద్దుగుమ్మని టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు

ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా జాన్వీ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ విషయం విన్న ఆమె అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఇక జాన్వీ కపూర్ చదువుకున్నప్పటి నుండే తనతో ఎంతో స్నేహంగా మెదులుతున్న శిఖర్ పహారియ తో లవ్ లో ఉంది. అయితే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్టీలు, పబ్బులు అంటూ తిరగడమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు.. వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి సంబంధం ఉండటంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.. అయితే వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త వినబడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: