తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కళ్యాణ్. రామ్ ఒకరు. ఇకపోతే ఈయన కేవలం సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ కి ఈయన దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా స్వయంగా ఈయనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బింబిసారా మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ లో వీరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే వీరి కొంబోలో రూపొందిన బింబిసారా మూవీ మంచి విజయం సాధించడంతో డెవిల్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరస్ అవుతుంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఆఖరుగా అమిగిస్ అనే మూవీ తో ప్రేక్షకులకు నిరాశపరచాడు. మరి ఈ మూవీ తో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: