తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలకు డాన్స్ కొరియో గ్రాఫర్ గా పనిచేసినటువంటి విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగినటువంటి అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. 

ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాట అయినటువంటి "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే" అంటూ సాగే సాంగ్ యొక్క ప్రోమోనో విడుదల చేశారు . దీనికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను సాంగ్ డిసెంబర్ 10 వ తేదీన ఉదయం 11 గంటల 35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ బాగుండడంతో ఫుల్ సాంగ్ పై కూడా ప్రేక్షకు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆదరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: