మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. చిరంజీవి హీరో గా రూపొందిన ఈ సినిమాలో రవితేజ .. చిరంజీవి కి తమ్ముడు పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే రవితేజమూవీ తర్వాత రావణాసుర ... టైగర్ నాగేశ్వరరావు అనే రెండు మూవీ లలో సోలో హీరోగా నటించి ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే ఇందులో రావణాసుర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకోగా ... టైగర్ నాగేశ్వరరావు మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "ఈగల్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.


మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక విడుదల చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్ , కావ్య తప్పర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే రవితేజ "పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ" బ్యానర్ వారు నిర్మించబోయే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి హరిష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ రైడ్ అనే హిందీ సినిమా ఆధారం గా తెరకెక్కబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది . ఇకపోతే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: