'యానిమల్' చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటేసింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ లో అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రలు పోషించారు.త్రిప్తి దిమ్రీ 'యానిమల్'లో రణబీర్‌తో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. ఒక్కసారిగా ఈ అమ్మడుకి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె జోయా పాత్రను పోషించింది. విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో త్రిప్తి దిమ్రీ చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఆమె కోసం సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, త్రిప్తి 'యానిమల్'లో తన ఇంటిమేట్ సన్నివేశాల గురించి ఓపెన్ అయ్యింది.'యానిమల్'లోని న్యూడ్ సీన్ కంటే 'బుల్ బుల్' లోలో రేప్ సీన్ చాల ఛాలెంజింగ్ గా అనిపించింది అని త్రిప్తి తెలిపింది. దానితో పోలిస్తే 'యానిమల్'లో ఇంటిమేట్ సీన్ అంతగా ఏమనిపించలేదు అని తెలిపింది. యానిమల్ సెట్స్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు కేవలం నలుగురు మాత్రమే ఉండేవారని త్రిప్తి వెల్లడించింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బుల్బుల్‌లో రేప్ సన్నివేశాన్ని చిత్రీకరించడం నాకు చాలా కష్టమని నేను భావిస్తున్నాను. ఆ సన్నివేశం కంటే 'యానిమల్ 'లో ఏ సీన్ కూడా కష్టంగా అనిపించలేదు'' అని తెలిపింది.

"యానిమల్‌లో నా సన్నివేశం పై కూడా చాలా విమర్శలను వచ్చాయి. మొదట్లో నేను విమర్శలతో బాధపడ్డాను. ఎందుకంటే నా తొలి ల గురించి ఎప్పుడూ ఎవ్వరూ విమర్శించలేదు. అయితే నేను కంఫర్టబుల్‌గా ఉన్నంత కాలం, సెట్స్‌లో నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను కంఫర్టబుల్‌గా ఉంచినంతవరకు. నేను చేసేది సరైనదని నేను భావించినంత వరకు, నేను ఇలాంటి సీన్స్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నటిగా ,ఒక వ్యక్తిగా నేను కొన్ని విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.'యానిమల్' సెట్స్‌లో ఇంటిమేట్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో కూడా త్రిప్తి తెలిపింది. "ఆ రోజు సెట్‌లో నలుగురు మాత్రమే ఉన్నారు. నేను, రణబీర్, సందీప్ సర్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ప్రతి ఐదు నిమిషాలకు వారు నన్ను అడుగుతూ ఉన్నారు. మీరు బాగున్నారా? మీకు ఏమి కావాలి? మీకు సౌకర్యవంతంగా ఉందా.? అని అడుగుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎంతగానో మద్దతు ఇస్తున్నప్పుడు, మీకు ఇబ్బందిగా అనిపించదు. అయితే, సెట్‌లలో ఇంటిమేట్ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారో తెలియని వ్యక్తు అలాగే మరియు నా పాత్రకు ఉన్న అవసరాన్ని బట్టి అలాంటి సన్నివేశాలు చేస్తూనే ఉంటాను" అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: