న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా పెద్దగా అంచనాలు లేకుండానే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీ ముందుగా టీజర్ ట్రైలర్ తో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసింది.ఇక నాని దసరా సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేస్తాడు అని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే నానికి కెరీర్ లో లవ్ ఎమోషనల్ స్టోరీలు మంచి సక్సెస్ అందుకున్నాయి.అందులో నిన్ను కోరి సినిమా అయితే ఎప్పటికీ టాప్ లిస్టులో ఉంటుంది. ఇక జెర్సీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమా కూడా అదే తరహాలో చాలా మంచి ప్రశంసలు  అందుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టాక్ కూడా మొదటి రోజే చాలా పాజిటివ్ గా వచ్చింది.ఈ సినిమా ఫస్ట్ రోజు ఈ సినిమా 10.6 కోట్లు వసూలు చేసింది.దసరా 38 కోట్లు డే 1 వసూళ్లు నమోదు చేయగా, అంటే సుందరానికి 10 కోట్లు, శ్యాం సింగారాయ్ 12 కోట్లు వసూలు చేశాయి.


ఇక హాయ్ నాన్న నార్త్ అమెరికాలో అయితే  అప్పుడే మిలియన్ డాలర్ మార్క్ వైపు దూసుకుపోతూ నాని కెరీర్ లో 9 వ మిలియన్ డాలర్ సినిమాగా నిలివబోతుంది.ఇక మొదటిరోజు వసూళ్లు డీసెంట్ గా ఉన్నప్పటికీ రెండవ రోజు మూడవ రోజు కలెక్షన్ సమాంతరంగా పెరిగిపోయాయి. ఇప్పుడు వస్తున్నా రెస్పాన్స్ చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మృనాల్ టాకూర్ కూడా అదరగొట్టింది. సినిమా హిట్ అయ్యి తనకు మంచి పేరు వస్తున్న సందర్బంగా  ఈ సినిమాకి, సీతా రామం సినిమాకి తన పాత్రలకు డబ్బింగ్ చెప్పిన చిన్మయికి మృనాల్ కృతజ్ఞతలు తెలిపింది.అసలు ఈ రేంజ్ లో సినిమాకి రెస్పాన్స్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. మొత్తానికి ఇక నాని కాన్ఫిడెన్స్ కు తగ్గట్టుగానే హాయ్ నాన్న లెక్క అసలు తప్పలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసి నిజంగా చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమా అలాంటి వారి కోసం బెస్ట్ అప్షన్ గా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: