టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత ఇక ఎవరూ ఊహించనీ విధంగా విడాకులు తీసుకొని విడిపోయారు అన్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానాన్ని కలిగి ఉన్న వీరు ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ ప్రకటించడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. అయితే విడాకులు తీసుకొని ఏళ్లు గడుస్తున్న ఇద్దరు మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాప్ గానే మారిపోతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తన కెరీర్ లో బిజీ బిజీగా ఉండగా.. సమంత అటు మయోసైటిస్ అనే ఒక మాయదారి వ్యాధి బారిన పడింది. ఇక ఇటీవల ఈ వ్యాధి నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఆమెకు భారీగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఇక రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో సమంత లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది ఈ హీరోయిన్. ఇక ఇటీవలే ఒక నెటిజన్ రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ ప్రశ్న వేయడంతో పాటు ఒక డేటా కూడా షేర్ చేసాడు


 కి డైవర్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నప్పుడు విడాకుల రేటు 50% ఉందని.. రెండోసారి మూడోసారి పెళ్లి చేసుకుంటే ఆ రేటు మరింత పెరిగిందని దీన్ని చూస్తే మీరు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ నేటిజన్ ప్రశ్నించగా.. ఈ డేటా చూస్తే వివాహం అనేది సరైన పెట్టుబడి కాదు అంటూ సమంత పేర్కొంది. అయితే ఇటీవల రెండో పెళ్లి పై నాగచైతన్య కూడా సమంత చెప్పినట్టుగానే స్పందించాడు. దూత ప్రమోషన్లలో మాట్లాడుతూ ప్రస్తుతం తన ఆలోచనలన్నీ సినిమా మీదే ఉన్నాయని.. రెండో పెళ్లి గురించి ఆలోచించే టైం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చాడు. నాగచైతన్య లీడ్ రోల్ లో నటించిన దూత వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: