ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అటు సౌత్ టూ నార్త్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి.అతిలోకసుందరి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది శ్రీదేవి పేరే. తన అందంతో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది శ్రీదేవి. ఆమె అంత పాపులర్ నటి కాబట్టే ఆమె కూతుర్లు తెగ ట్రెండ్ అవుతున్నారు. శ్రీదేవి కూతుర్లు ఆమె గుర్తులను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా ఎప్పుడు కూడా బాలీవుడ్ లో తెగ ట్రెండ్ అవుతుంది.అచ్చం ఆమె అమ్మలాగే ఉండడం తో అందరూ ఆమెలో శ్రీదేవిని చూసుకుంటున్నారు .ఇక తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసినప్పటికీ క్రేజ్ దక్కించుకోలేకపోయింది .అయితే రీసెంట్గా బోనీ కపూర్ - జాన్వి కపూర్- ఖుషి కపూర్ తమ ఉమ్మడి ఆస్తిని అమ్మేశారు .


ముంబైలోని అందేరీలో వీళ్ళ ముగ్గురికి జాయింట్ గా మొత్తం నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి.ఇక వీటిని వీళ్లు అమ్మేశారు . ఇంకా ఈ నాలుగు ఫ్లాట్స్ కూడా కేవలం 12 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్లు ప్లాపులు నటనతో సంబంధం లేకుండా మంచి పొజిషన్లో ఉన్న జాన్వి కపూర్,ఖుషి కపూర్ డబ్బు పరంగా బాగానే సెటిల్ అయినా సరే ఎందుకు ఈ ఫ్లాట్స్ అమ్మారు అన్నది ఇంకా తెలియడం లేదు . అయితే తమ నిరార్ధక ఆస్తులను వదిలించుకునే ప్రయత్నంలోనే ఈ పని చేశారు అంటూ బాలీవుడ్ మీడియా కోడయ్యి కూస్తుంది. వీరు త్వరలోనే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకొనే ఆలోచనలో ఉన్నారాట. ఇక ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాతో బాగా బిజీగా ఉన్న  ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ పలు ఫోటోషూట్స్ యాడ్స్ రూపంలో కూడా భారీగానే డబ్బులు సంపాదిస్తుంది.ఇక దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: