సంక్రాంతి రేస్ లో అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘గుంటూరు కారం’ మూవీకి డివైడ్ టాక్ రావడమే కాకుండా ఈమూవీ చూసిన కొందరు ప్రేక్షకులు తల్లి ఇంటికి దారేది అంటూ జోక్ చేస్తూ ధియేటర్ల నుండి బయటకు వస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను బట్టి అత్యంత భారీ బిజినెస్ జరుపుకున్న ఈమూవీ బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా గట్టెక్కుతార అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.



ఈమూవీ పరిస్థితి ఇలా ఉంటే ఈమూవీతో పోటీగా విడుదల అయిన ‘హనుమాన్’ టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ‘గుంటూరు కారం’ పై ‘హనుమాన్’ ఆదిపత్యం స్పష్టంగా కనపడుతోంది. ఈసినిమా రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాలలో వేసిన అనేక ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకులతో పాటు ఈమూవీ మొదటిరోజు మార్నింగ్ షో చూసిన సగటు ప్రేక్షకులు అంతా ప్రస్తుతం హనుమంతుడి మ్యానియాలో మ్యానియాలో ఉన్నారు.





ఈసినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తి వేస్తున్నారు. ఈసినిమా చివరికి వస్తున్న సమయంలోప్రపంచ నాశనంకోసం అసుర గణం తరలి వస్తోంది కాబట్టి దాన్ని అణచాలంటే ఖచ్చితంగా నువ్వే రావాలి హనుమా అంటూ విభీషణుడి పాత్రతో చెప్పించడంతో ఈమూవీకి సీక్వెల్ ఖాయం అన్న స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. 2025లో ఈసినిమాకు సంబంధించిన సీక్వెల్ ఉంటుందని ఈమూవీ దర్శక నిర్మాతలు ఇప్పటికే లీకులు ఇచ్చారు.



ప్రస్తుతం ‘హనుమాన్’ మూవీకి వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ కు సరైన సంఖ్యలో ధియేటర్లు తోడైతే చిన్న సినిమాగా వచ్చిన ‘హనుమాన్’ కలక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయం అని అంటున్నారు. ఈ మూవీని సంక్రాంతి రేస్ నుండి తప్పుకోమని ఎందరో  ఇండస్ట్రీ ప్రముఖులు ఒత్తిడి చేసినప్పటికీ ‘హనుమాన్’ నిర్మాతలు చేసిన సాహసం కాసుల వర్షం కురిపించబోతోంది. దీనికితోడు ఈనెల 22న అయోధ్య రామమందిరం అత్యంత ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న నేపధ్యంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈమూవీ ఉత్తరాది ప్రాంతాలలో కూడ సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది.. .    



మరింత సమాచారం తెలుసుకోండి: