ఇప్పుడు తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే పేరుతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్లు కూడా గతంలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా గడిచిన కొన్ని గంటల క్రితం ఈ సినిమా ట్రైలర్ కూడా చిత్ర బృందం విడుదల చేశారు. ట్రైలర్ కూడా మరొకసారి యాక్షన్ లవ్ డ్రామా రొమాన్స్ వైలెన్స్ వాటితో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం పల్లెటూరు బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు ఈ ట్రైలర్లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో చూస్తే పవర్ఫుల్ డైలాగులు కూడా సుహాస్ అభిమానులను విజిల్స్ వేయించెల కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో మరొకసారి కలర్ ఫోటో సినిమా రేంజ్ లో ఊహించేలా కనిపిస్తోంది. ఈ సినిమా కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. సుహాస్ కి జోడిగా ఇందులో శివాని నాగారం నటిస్తోంది డైరెక్టర్ దృశ్యంత్ కటికనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్-2 బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సినిమాతో తన నటనని ప్రూఫ్ చేసుకుంటున్నారు సుహాస్.. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి