టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 29 వ సినిమాతో సితార లాంచ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయా? తండ్రీ-కుమార్తెల్ని ఒకే ప్రేమ్ లో చూపించడానికి రాజమౌళి ఆసక్తిగా ఉన్నాడా? అంటే అవుననే సన్నిహిత వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.సూపర్ స్టార్ మహేష్ మొదటి పాన్ ఇండియా మూవీ కోసం కొన్ని నెలలుగా రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే జర్మనీలో ఆ సినిమాకి అవసరమైన ట్రైనింగ్ పూర్తి చేసాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్స్ మొదలు పెట్టడానికి రాజమౌళి కూడా రెడీ అవుతున్నారు.నాలుగైదు నెలల పాటు ఈ వర్క్ షాప్స్ ఉంటాయని సమాచారం తెలుస్తుంది. ఈ వర్క్ షాప్స్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు సితార కూడా పాల్గొంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం తెలిసింది. దీంతో ఈ సినిమాలో సితార కూడా నటిస్తుందా? అనే హింట్ లీకై వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో అందరికి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.గ్లోబ్ ట్రాటింగ్ జానర్ లో ఈ సినిమా రూపొందుతుంది.


పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేసే బిహైండ్ ఐడియాతో రంగంలోకి మహేష్ రాజమౌళి దిగుతున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా కన్నా సితారకు గొప్ప లాంచింగ్ ఎక్కడ దొరుకుతుంది? అంటే అందుకు ఛాన్సే లేదని చెప్పాలి. ఇటువంటి సినిమాలో సితారకు  ఓ పాత్ర ఇస్తే సరి ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది.తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ కి లాగే సితార నరనరనా సినిమా ఉంది. చిన్న వయసులోనే ఆమె డాన్సులో ఆరితేరింది. ఇప్పుడు చాలా ఈజీగా డాన్సు చేస్తుంది. కెమెరా ఫియర్ అనడానికి అస్సలు ఛాన్సే లేదు. తాతయ్య సూపర్ స్టార్..తాతయ్య వారతస్వాన్ని తండ్రి మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు అదే తండ్రి వారతస్వాన్ని సితార రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి రెడీగా ఉంది. కాబట్టి సితారకి ఖచ్చితంగా ఇంతకన్నా మంచి సినిమాగానీ... మంచి టైమింగ్ గానీ.. దర్శకుడు కానీ కుదరడు. ఆమె లాంచింగ్ కి అన్ని రకాలుగా ఇదే సరైన సమయమని సూపర్ స్టార్ అభిమానులు కూడా భావిస్తున్నారు.సూపర్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు కన్పర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: