ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అటు విశ్వక్సేన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విశ్వక్సేన్ కెరియర్ లోని ప్రతిష్టాత్మకమైన మూవీలో నటిస్తున్నాడు. గామి అనే డిఫరెంట్ ఓరియంటెడ్  సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇక ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ మూవీలో ఏకంగా అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు విశ్వక్సేన్.


 చాందిని చౌదరి ఇక ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అఘోర పాత్రలో నటించడానికి వెనుక ఎలాంటి ప్రిపరేషన్ చేశారు అంటూ అడగగా ఆసక్తికర విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నాడు విశ్వక్సేన్. అఘోర లుక్ లో కనిపించడం విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. 15 రోజుల ముందే షూటింగ్ గురించి తెలిస్తే.. మెల్లగా ఇక అఘోరాలా మారిపోవడానికి ప్రిపేర్ అయ్యేవాడిని.. అఘోర పాత్రను ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంపై దర్శకుడు కావాల్సినంత రీసర్చ్ చేశారు. కుంభమేళాలో లక్షల మంది అఘోరాలు ఉంటారు. వారితో కలిసిపోయి నేను కూడా ఉండేవాడిని.


 ఇక నా స్టైల్ లోనే ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోర అనుకొని చాలామంది నాకు దానాలు కూడా చేసేవారు అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలోని షూటింగ్ ప్రతిరోజు సవాలు గానే అనిపించింది. మైనస్ 30 డిగ్రీల్లో షూటింగ్ చేశాం. కాళ్లు చేతులు గడ్డ కట్టుకుపోయేవి. నిజంగా ఇవన్నీ తలుచుకుంటేనే ఈ మూవీ కోసం ఇంత సాహసం చేసామా అని అనిపిస్తూ ఉంటుంది అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు  అయితే ఈ మూవీ ఇక తన కెరియర్లో గేమ్ చేంజర్ గా మారుతుంది అని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం విశ్వక్సేన్ గామి సినిమాతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని నటిస్తూ ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వెంటనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: