మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన 'ప్రేమలు' అనే సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు రెడీ అయింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఈ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా ఏకంగా రూ.70 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ మూవీకి సంబంధించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే తెలుగు ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా చాలా బాగా కనెక్ట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్‌ను ఖచ్చితంగా ఎంతగానో అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.


సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 8 వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ నటించిన 'భీమా' ఇంకా అలాగే చిన్న హీరో విశ్వక్ సేన్ నటించిన 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌ చేసే సినిమాలు బాగానే రానున్నాయి.ఇక ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్‌కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది అతని ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌ సిటీకి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇక ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? వారు తమ ఈ లవ్ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది ఈ సినిమా యొక్క స్టోరీ. ఈ సినిమా మాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా 70 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి ఇంకా రన్ ని కొనసాగిస్తూ 100 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతుంది. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి హిట్టుని నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: