దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ప్రస్తుతం "లవ్ మీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇదే ఈయనకు మొదటి సినిమా. ఈయన ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరీర్ ను ప్రారంభించబోతున్నాడు.

హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి మరియు నాగ మల్లిడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కి పి సి శ్రీరామ్ సినిమాటో గ్రాఫర్‌ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం రెడీ అయ్యింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

మూవీ లోని మొదటి పాట అయినటువంటి "రావాలి రా" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా మార్చి 30 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న ఆశిష్ "లవ్ మీ" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: