మోస్ట్ లక్కీస్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వారిలో సంయుక్తా మీనన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకరత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ... అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో టాలీవుడ్ ఇంట్రెస్ట్ ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమె నటించిన బింబిసారా , విరూపాక్ష సినిమాలలో నటించింది. ఈ రెండు మూవీలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో లక్కీ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈ నటి కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ఈ బ్యూటీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

ఇకపోతే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలం లోనే సంయుక్త ను కొంత మంది బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన దర్శక , నిర్మాతలు మూవీ ప్రపోజల్ లో భాగంగా కలిసినట్లు ఈమె కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు అందులో భాగంగా ఈమె తాజాగా ముంబై కి బయలు దేరినట్లు తెలుస్తోంది. ముంబై లో ఈమెను సంప్రదించిన దర్శక , నిర్మాతలతో మరోసారి చర్చలు చేసి కథ అంతా నచ్చినట్లు అయితే ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమెకు తెలుగు లో మంచి క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈమె తెలుగు తో పాటు హిం దీలో కూడా వరస సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: