ఈ ఏడాది మలయాళం సినిమాలు అద్భుత విజయం సాధిస్తున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయాలను సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకుడికి మూవీ కంటెంట్ కనెక్ట్ అయితే చాలు ఆ సినిమాలు భారీ విజయం సాధిస్తున్నాయి.రీసెంట్ గా వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే మలయాళం నుంచి వచ్చిన మరో సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ఈ సినిమా మలయాళంలో  సూపర్ హిట్ అయింది. 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా  ఓటీటీలోకి రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 'మంజుమ్మెల్ బాయ్స్' మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సినిమా మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు ' అందుబాటులోకి రానుంది. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ సొంతం చేసుకుంది.. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం మే 3న ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షబీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ మరియు గణపతి పొదువాల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సౌబిన్ షబీర్ నిర్మించారు. మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ద్వారా తెరకెక్కింది.కొందరు యువకులు 'గుణ గుహ'కు విహారయాత్రకు వెళ్తారు.ఇందులో ఒక వ్యక్తి గుహలో పడతాడు. అతడిని ఏ విధంగా రక్షిస్తారనేది  ఈ సినిమా కథ.2006లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను  తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: