టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ తాజాగా భాజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా మే 31 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ అతి దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. 

అందుకు సంబంధించిన అఫిషియల్ రిపోర్ట్ ను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో అయినటువంటి కార్తికేయ కూడా వరుస ఇంటర్వ్యూ లలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమా యొక్క ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , కార్తికేయ ఆఖరుగా నటించిన బెదురులంక 2012 మంచి విజయం సాధించడంతో భజే భాయు వేగం సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఈ యువ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో , బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తాడో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: