లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించి తన నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో మాత్రమే కాకుండా వారి కంటే సీనియర్ స్టార్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ తో కూడా ఈమె నటించింది. 

ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలా కెరియర్ పిక్స్ లో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈమె కమర్షియల్ సినిమాలలో కాకుండా పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించడం మొదలు పెట్టింది. వాటిలో కూడా ఈమె నటించిన అనేక సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ నటికంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెలుగులో ఏర్పడింది. ఇక ఈమె మంచి స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించింది. దానితో ఈమె సినిమాలు తగ్గించింది.

కొంతకాలం క్రితం ఈమె మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూన్ 24 వ తేదీన ఉదయం 10 గంటల 49 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: