ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.  దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్లో ఏ మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల  ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు.


 ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు థియేటర్లోకి వెళ్లి చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు కూడా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నే రేంజ్ లో ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది అన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాగా ఈ మూవీలో అమితాబచ్చన్ కమలహాసన్ దీపిక పదుకొనే లాంటి ఎంతోమంది స్టార్లు నటించడంతో ఇక ఆ అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం చిత్ర బృందం  ప్రమోషన్స్ నిర్వహించడంతో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్, కల్కి మూవీలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 కల్కి 2898 ఏడి సినిమాలో బైరవ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి అంటూ హీరో ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అయితే మొదటిసారి ఇలాంటి పాత్ర చేస్తున్నాను అంటూ తెలిపాడు. ఇటీవలే మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తన కెరియర్ లోనే ఇది బెస్ట్ రోల్ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభం అవ్వగా నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యాయి అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ గా మారబోతుంది అని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: