కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇది ఈమెకు మొదటి సినిమా కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం అటు తారక్ తీసుకున్న పారితోషకం ఎంత? డైరెక్టర్ కొరటాల శివ ఎంత పుచ్చుకున్నాడు అన్న విషయం కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ కొరటాల శివకు అందిన రెమ్యూనరేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆయన దేవర మూవీ కోసం 30 కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. కానీ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా మాత్రం మిస్ ఫైర్ అయింది. అయితే గతంలో తారక్ తో తీసిన జనతా గ్యారేజ్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే అటు నిర్మాతలు కొరటాల శివకు భారీగా పారితోషకం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు అనేది తెలుస్తోంది.