టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు . ఈయన ఎన్నో సినిమాలలో నటించి కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు ఎన్నో మూవీ లను నిర్మించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకని నిర్మాతగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "NKR 21" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అలనాటి స్టార్ నటి అయినటువంటి విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇలా NKR 21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో విజయశాంతి కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సినిమాపై ఒక్క సారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నట్లు , అదే టైటిల్ ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి రుద్ర అనే టైటిల్ ను కాకుండా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ ఈ టైటిల్ నే మేకర్స్ ఫిక్స్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి NKR  21మూవీ కి ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారొట్ అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr