సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కెరియర్ పిక్ దశలో ఉండగా పెళ్లిళ్లు చేసుకోరు. దానికి ప్రధాన కారణం పెళ్లిళ్ల తర్వాత సినిమాలకు దూరంగా ఉండే అవసరం వచ్చే ఛాన్సెస్ ఉండడం. ఇక కొంత మంది పెళ్లి తర్వాత సినిమాల్లో నటించిన కూడా కొన్ని మూవీ లకు కమిట్ అయిన తర్వాత వారు గర్భం దాల్చడంతో మూవీ లను వదిలేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇలా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూ ఏదో ఒక మూవీ కి కమిట్ అయ్యాక గర్భం దాల్చడంతో మూవీలను వదిలేసిన నటీమణులు కూడా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈ లిస్టు లోకి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి కియార అద్వానీ కూడా చేరింది. హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన ఈ బ్యూటీ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితమే ఈమె వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈమె సినిమాల్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ డాన్ 3 అనే మూవీ లో హీరోయిన్గా ఎంపిక అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది.

ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న నేపథ్యం లోనే ఈమె గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. దానితో డాన్ 3 సినిమా నుండి ఈమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే డాన్ 3 మూవీ లో రన్వీర్ సింగ్ హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: