
తమన్నా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యూటీ వయస్సు 36 సంవత్సరాలు. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. కానీ తమన్నా ప్రేమలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ వారి రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా సందర్భాలలో కెమెరా కంట కూడా పడ్డారు.
అంతేకాకుండా ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. వివాహం జరిగిన తర్వాత వారు ఉండడానికి విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాలు జోరుగా ప్రచారాలు సాగాయి. ఇదిలా ఉండగా....గత మూడు రోజుల నుంచి తమన్న, విజయవర్మ బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే బ్రేకప్ వార్తలపై తమన్నా స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్ లో తమన్నా ప్రేమపైన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రేమించే వారిని వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలని తమన్నా అన్నారు. రిలేషన్ కు, ప్రేమకు మధ్య చాలా తేడా ఉంటుందని తమన్నా వెల్లడించారు. అవతలి వ్యక్తి తమకు నచ్చేలా ఉండాలి అని అనుకుంటే అది ప్రేమ కాదని బిజినెస్ అవుతుందని తమన్నా అన్నారు. నిస్వార్ధమైన ప్రేమ ఎప్పుడూ వన్ సైడ్ లవ్ లోనే ఉంటుందని తమన్నా చెప్పుకోచ్చారు. ప్రస్తుతం తమన్నా మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారుతున్నాయి.