సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం .. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ అనే కొత్త దర్శకుడు శకం మొదలైంది .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరికి మొదటి అవకాశంం ఇచ్చారు .. ప‌వ‌న్‌ తో చేసిన బద్రి సినిమా రిలీజ్ అయిన రోజు .. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ .. రమణ గోగుల పాటలు సంగీతం అప్పటికే పెద్ద హిట్ కాగా మాస్ కి నచ్యే అంశాలు తక్కువ ఉన్నాయనే మాట నిర్మాత త్రివిక్రమరావులో కొంత కంగారు పెట్టించింది .. అయితే అది కేవలం కొన్ని గంటలకే పరిమితమైంది .. తర్వాత యూత్ మొత్తం థియేటర్లకు క్యూ కట్టారు మాస్ సెంటర్స్ లో టికెట్లు దొరకకుండా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి .. ఆడియో క్యాసెట్లు హార్ట్ కేకుల అమ్ముడైపోయాయి పవన్ ను చూసి అభిమానులు పిచ్చెక్కిపోయారు .. ఫలితంగా 47 సెంటర్లో బద్రి 100 రోజులు పూర్తిచేసి పూరి జగన్నాథ్ కు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది ..


అయితే ఇది అంత ఈజీగా జరిగింది కాదట .. చిన్నగా చెప్పుకోవాల్సిన పెద్ద స్టోరీ ఉంది .. రామ్‌గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా చేయాలని కంకణం కొట్టుకుని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి చోటా కె నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తెచ్చుకున్నాడు .. ముందుగా కెమెరామెన్ ఛోటా కథ విని సంతృప్తి చెందాకే రికమెండ్ చేశాడు జ‌జ‌ ఓ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ కి స్టోరీ వినిపించి మెప్పించి క్లైమాక్స్ మార్చమని చెప్పిన మార్చకుండా తన స్క్రిప్ట్ కి కట్టుబడి నమ్మకంతో బద్రి సినిమాను విజయవంతంగా సెట్స్ పైకి  తీసుకు వెళ్ళగలిగాడు .. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ముందు చోటాకు చెప్పింది వేరే స్టోరీ ..


ఇక ఈ సినిమా చాలామంది జీవితాలను మార్చేసింది .. పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ పరిచయం పెళ్లి వరకు వెళ్లిలా చేసింది కూడా బద్రి సినిమానే .. భారీ ఫైట్లు లేకుండా కేవలం ఒక్క ఆఫీస్ రూమ్ లోనే పవన్ , ప్రకాష్ రాజ్‌ మధ్య వచ్చే నే సీన్స్ తో మాస్ కి గూస్బమ్స్ తెప్పించే ట్రెండ్ కూడా మొదలైంది బద్రి సినిమాతోనే .  అలాగే రమణ గోగుల డిమాండ్ కూడా మరింత పెరిగింది .. బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కు తొలి అడుగులోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ వచ్చింది .. ఒక హిట్ తోనే పూరీకి వరుస అవకాశాలు వచ్చాయి .. ఆ సమయంలో సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు రిఫరెన్స్ బద్రిలో ఎంతో ఉంటుంది .. ఇక నిన్న ఆయన 75వ పుట్టినరోజు నాడే ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండటం బద్రి 25వ వసంతంలోకి అడుగుపెట్టడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: