
అలా అన్ స్టాపబుల్ తో భారీ క్రేజీ సంపాదించుకున్న బాలయ్య బిగ్బాస్ హోస్టుగా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు అందుకు సంబంధించి చర్చలు కూడా ప్రారంభమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అన్ స్టాపబుల్ రైటింగ్ టీమ్ ను కూడా తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోలో ఆహాలో బాగా క్లిక్ అవడంతో అక్కడ వర్క్ చేసే రైటింగ్ టీం హస్తం కూడా ఉందని కూడా చాలా కష్టపడుతూ ఉందని గుర్తించిన బిగ్ బాస్ సంస్థ వారిని తీసుకొనేలా ప్లాన్ చేస్తున్నారట.
అయితే టాక్ షో వేరు కానీ బిగ్ బాస్ షో అలా ఉండదు. దాదాపుగా పదిమంది హౌస్ మేట్స్ తో డీల్ చేయవలసి ఉంటుంది. మరి ఎంత రైటింగ్ టీమ్ ఉన్నప్పటికీ కూడా స్పాంటినేషన్ అనేది కచ్చితంగా ఉండాలి.. స్పాట్లో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, మాట్లాడవలసి ఉంటుంది వాళ్లని వాళ్లు కంట్రోల్ చేయగలిగాలి.. ఇవే కాకుండా చాలా పనులు బ్యాక్ అండ్ టీం నుంచి సపోర్ట్ ఉండవలసి ఉంటుంది. మరి వీటన్నిటిని బాలయ్య చేయగలరా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ బాలయ్య బిగ్ బాస్ కు హోస్టుగా వస్తారంటే క్రేజ్ ఉంటుంది కానీ నాగార్జున స్టైల్ తో పోలికలు అనేవి మ్యాచ్ కావని మరి కొంతమంది నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.