శ్రీనిధి శెట్టి ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీనిధి శెట్టి మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2016లో మిస్ సుప్రా నేషనల్ పోటీలలో ఆమె విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక శ్రీనిధి తెలుగులో కేజిఎఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటన, తన అంద చందాలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. తన అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఎంతోమంది ఆకర్షితులు అయ్యారు. ఈ సినిమా అనంతరం ఈ చిన్నది తెలుగులో హిట్ 3 సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

 ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరో నానికి భార్య పాత్రలో అద్భుతంగా నటించినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా, శ్రీనిధి శెట్టి తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. శ్రీనిధి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీనిధి మాట్లాడుతూ.... ''రామాయణ్'' సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లుగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెల్లడించారు. నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించారు.

 సీతగా నటించమని ఆఫర్ వచ్చినప్పటికీ సున్నితంగా రిజెక్ట్ చేశారట. దానికి గల ప్రధాన కారణం ఆ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి తన పాత్రను వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి వెల్లడించారు. యష్, శ్రీనిధి శెట్టి ఇద్దరు కలిసి కేజిఎఫ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ''రామాయణ్'' సినిమాను ఆఫర్ ను శ్రీనిధి శెట్టి రిజెక్ట్ చేసిన అనంతరం హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనంతరం ఈ సినిమాలో రణబీర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీనిధి శెట్టి షేర్ చేసుకోగా అది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: