
మెగాస్టార్ చిరంజీవి మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీకు ఎలా అనిపించిందని నానిని అడిగింది. దానికి నాని మాట్లాడుతూ.. 'ఆయన నన్ను ప్రశంసించినప్పుడు వచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఆయన కెరీర్ లో దాదాపు 75 శాతం పూర్తయ్యాక, నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ సమయంలో చిరంజీవి ఎన్నో జనరేషన్స్ లను చూశారు. అలాంటి గొప్ప వ్యక్తికి నాపై నమ్మకం ఉందంటే అంతకుమించినా ఆనందం ఇంకొకటి ఉంటుందా. నిజంగా చెప్పాలంటే ఆయన ప్రశంస నాకు ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డు' అని నాచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విశ్వక్ సేన్, అడివి శేష్ హిట్ 3 సినిమాలో కనిపిస్తారా అని సుమ అడగ్గా.. వాళ్ళు ఉన్నారా లేదా అనేది తను చెప్పనని కానీ అందులో చాలా సర్ప్రైజ్ ఉంటాయని నాని బదులిచ్చారు.
హీరో నాని ఇటు హీరోగా మూవీస్ లో నటిస్తూనే.. అటు నిర్మాతగా సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే హిట్ 1, హిట్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టాయి. దీంతో వచ్చే నెల 1న హిట్ 3తో హీరో నాని ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇటీవలే నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ సినిమా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని ది ప్యారడైస్ సినిమా కూడా చేస్తున్నాడు.