సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా ఆడి పాడింది. ఇక సమంత తెలుగుతో పాటు హిందీలో కూడా నటిస్తోంది. ఇప్పటికే సమంత బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సమంత తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. ఆ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులో సమంత ''సముద్రాలు నీళ్లు తాగలేవు... చెట్లు తమ పండించిన పంటను తినలేవు. సూర్యుడు తన కాంతిని చూడలేడు. పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం మాత్రమే జీవించండి. మనమందరం కూడా ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాము.

 నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు. అందరికోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు" అని అర్థం వచ్చే విధంగా సమంత పోస్ట్ లో షేర్ చేసుకుంది. ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత తన పోస్ట్ లో తెలియజేసింది. కాగా భారత్ - సింధు జలాలను పాకిస్తాన్ కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఇలా పోస్ట్ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంత షేర్ చేసిన పోస్ట్ పైన పలువురు నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత పాకిస్తాన్ కు తన మద్దతును తెలిపే విధంగా ఈ పోస్ట్ ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: